ఆప్కాస్‌లో అడ్డగోలు దోపిడీ

ABN , First Publish Date - 2022-09-30T10:03:44+05:30 IST

ఆప్కాస్‌లో అడ్డగోలు దోపిడీ

ఆప్కాస్‌లో అడ్డగోలు దోపిడీ

అక్కడంతా దోచుకో.. పంచుకో.. తిను విధానం

దొంగ బిల్లులతో అధికారులు కోట్లు స్వాహా 

జిల్లాల పర్యటన పేరుతో లక్షల్లో డ్రా

ముందుగానే ట్రావెల్స్‌ కంపెనీతో కుమ్మక్కు

సొంత ప్రయాణాలకూ సంస్థ నుంచే బిల్లులు

పీఏ, అకౌంటెంట్‌ పేరుతో నిధులు జేబులోకి

సీఎం పర్యవేక్షించే విభాగంలో అక్రమాలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి తన మానస పుత్రికగా చెప్పుకొంటున్న, నేరుగా పర్యవేక్షిస్తున్న విభాగంలో ‘దోచుకో.. పంచుకో.. తిను’ పద్ధతి నడుస్తోంది. అధికారులు దొంగ బిల్లులతో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. జిల్లాల పర్యటన పేరుతో లక్షలు డ్రా చేసుకుంటున్నారు. చివరకు దసరా, సంక్రాంతి, న్యూ ఇయర్‌ వేడుకలను కూడా ప్రభుత్వ నిధులతో జరుపుకొంటున్నారు. ఆప్కా్‌సలో సాగుతున్న వ్యవహారం ఇది. ట్రావెల్‌ బిల్లులు, హోటల్‌ బిల్లులు, ఆడ్వాన్స్‌ పేమెంట్స్‌ పేరుతో కొన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు. ఆప్కా్‌సలో ఎన్నిసార్లు లెక్కపెట్టినా 40 మందికి మించి సిబ్బంది ఉండరు. ఒక ఎండీ, ఇద్దరు జనరల్‌ మేనేజర్లు, ఇద్దరు మేనేజర్లు, ఐదుగురు సీనియర్‌ అకౌంటెంట్లు, 20 మంది డీఈవోలు, తొమ్మిది మంది ఆఫీస్‌ సబార్డినేట్లు, ఒక వాచ్‌మ్యాన్‌ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి జీతాలు కాకుండా నెల వారి ఖర్చులు మాత్రం లక్షల్లో ఉంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్‌, హోటల్‌ బిల్లుల పేరుతో అక్రమంగా డ్రా చేస్తున్నారు. ప్రతి జిల్లాకు వెళ్లడం... అక్కడ ఈపీఎఫ్‌, ఈఎ్‌సఐ అధికారుల కార్యాలయాల సందర్శన పేరుతో బిల్లులు పెడుతున్నారు. ఆప్కాస్‌ సిబ్బంది జిల్లాల పర్యటనలకు ఎందుకు వెళ్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈఎ్‌సఐ, ఈపీఎఫ్‌ ప్రధాన కార్యాలయాలు విజయవాడ, గుంటూరులోనే ఉన్నాయి. ఇటీవల ఆప్కా్‌సలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉన్నతాధికారి కుటుంబంతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లారు. సొంత జేబులో నుంచి ఖర్చులు పెట్టుకోవడం ఎందుకని ఆప్కా్‌సను వాడేశారు. వచ్చేటపుడు తిరుపతి ఈఎ్‌సఐ ఆస్పత్రికి వెళ్లి కాసేపు అక్కడ డాక్టర్లతో ముచ్చటించి విజిట్‌ పేరుతో బిల్లులు డ్రా చేశారు. ఇలా అనేక దొంగ బిల్లులు పెట్టి లక్షల రూపాయలు డ్రా చేస్తున్నారు. 


కళ్లు తిరిగేలా బిల్లులు... 

విజయవాడలో ఒక ప్రముఖ ట్రావెల్స్‌ కంపెనీతో ఆప్కాస్‌ అధికారులు కుమ్మక్కయ్యారు. అధికారులు ఎంత మొత్తంలో బిల్లు అడిగితే ట్రావెల్స్‌ కంపెనీ ఆ మేరకు బిల్లులు ఇచ్చేస్తుంది. అవి తీసుకుని అధికారులు అకౌంట్‌ నుంచి డ్రా చేయడమే పనిగా పెట్టుకున్నారు. మొత్తం బిల్లులు జిల్లాల విజిట్‌ పేరుతోనే ఉంటున్నాయి. ఆప్కా్‌సలో ఉన్నతాధికారులకు అనుకూలంగా వ్యవహరించే ఇద్దరు ముగ్గురు పేరు మీదే బిల్లులు డ్రా అవుతున్నాయి. ఆ బిల్లులు చూస్తే కళ్లు తిరుగుతాయి. ఒక అకౌంటెంట్‌ జిల్లాల పర్యటన పేరుతో నెల నెలా రూ.2.50 లక్షలు డ్రా చేస్తున్నారు. ఐఏఎ్‌సలకు కారు అలవెన్స్‌లు రూ.65 వేలకు మించి ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఆప్కాస్‌ ఉన్నతాధికారుల కారు అలవెన్సుల బిల్లులు మాత్రం లక్షల్లో ఉంటున్నాయి. మరోవైపు ట్రావెల్‌ కంపెనీకి అడ్వాన్స్‌ పేమెంట్లు కూడా ఇస్తున్నారు. 


పీఏల పేరుతోనూ లాగేస్తున్నారు

ఆప్కా్‌సలో ఉన్నతాధికారులు పీఏల పేరుతో కూడా బిల్లులు లాగేస్తున్నారు. సాధారణంగా ఉన్నతాధికారులు జిల్లాల పర్యటనకు వెళ్తేనే... వారి వెంట పీఏలు వెళ్తారు. కానీ ఆప్కా్‌సలో విచిత్రంగా ఉన్నతాధికారులు ఆఫీసులోనే ఉంటారు. పీఏలు మాత్రం విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతికి వెళ్లి జీఎస్టీ, ఈఎ్‌సఐ, ఈపీఎఫ్‌ వ్యవహారాలు చక్కబెట్టి వస్తున్నట్లు చూపిస్తున్నారు. సాధారణంగా ఏ విభాగంలోనైనా పర్యటన అనంతరం బిల్లులను ప్రాసెస్‌ చేస్తారు. ఆప్కా్‌సలో మాత్రం ఇందుకు విరుద్ధం. పీఏల జిల్లాల పర్యటనలకు ఆడ్వాన్స్‌ పేమెంట్‌ ఇస్తారు. మొత్తానికి దొంగ బిల్లులు పెట్టి అడ్డగోలుగా లక్షలకు లక్షలు డ్రా చేస్తున్నారు. సాధారణ పరిపాలన శాఖ కిందకు వచ్చే ఈ విభాగంలో దొంగ బిల్లుల వ్యవహరం ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


అధికారులకు ‘పండుగే’... 

ఆప్కా్‌సలో దోపిడి పరాకాష్ఠకు చేరిందని చెప్పడానికి దసరా, న్యూ ఇయర్‌ వేడుకలే ఉదాహరణ. ఏ ప్రభుత్వ కార్యాలయంలో లేని విధంగా ఆప్కా్‌సలో ప్రభుత్వ నిధులతో పండుగలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలకు రూ.25 వేలు ఖర్చు చేశారు. దసరా, దీపావళి, సంక్రాంతి పేరుతో ప్రతి పండుగకు వేలల్లో ఖర్చులు చూపించి డ్రా చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థల్లో పండుగలు నిర్వహించడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇక ఉద్యోగులకు ప్రతి నెలా బెస్ట్‌ ఎంప్లాయిస్‌ అవార్డులు ఇస్తున్నారు. ఇందుకు భారీగా ఖర్చు పెడుతున్నారు. బెస్ట్‌ అవార్డు పొందిన వారికి రూ.5 వేలు ఇస్తారు. ఇలా అధికారులకు ఎలాంటి ఆలోచన వచ్చినా వెంటనే అమల్లోకి వస్తుంది. వారికి ‘లాభం’ ఉంటేనే అమలు చేస్తారు. ఒకవైపు కార్మిక నిబంధనలకు విరుద్ధంగా ఈఎ్‌సఐ, ఈపీఎఫ్‌ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేశారు. దీంతో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఈపీఎఫ్‌ విభాగానికి రూ.5 కోట్ల పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం బయటకు పొక్కనీయకుండా ఈపీఎ్‌ఫతోనే యుద్ధానికి దిగారు. మరోవైపు దొంగ బిల్లులతో భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. తమది పారదర్శక పాలన అని చెప్పుకొనే ముఖ్యమంత్రికి.. తన పర్యవేక్షణలో ఉన్న ఆప్కా్‌సలో ఈ స్థాయిలో దోపిడి జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి చెప్పే ‘దోచుకో... దాచుకో.. తినుకో’ విధానం ఆప్కా్‌సలో కొనసాగుతోంది. 

Updated Date - 2022-09-30T10:03:44+05:30 IST