సీఎం జగన్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్

ABN , First Publish Date - 2022-08-02T02:09:18+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాలూచీ పడి పోలవరం నిర్వాసితులను వరదల్లో ముంచుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.

సీఎం జగన్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్

రాజమండ్రి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాలూచీ పడి పోలవరం నిర్వాసితులను వరదల్లో ముంచుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావటంలో జగన్ వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్ ఇప్పుడు మోదీకి సాగిలపడి దండాలు పెడుతున్నాడని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం దివాళా తీసిందన్నారు. ఆర్ధిక మంత్రి బుగ్గన అప్పుల మంత్రిగా మారారని విమర్శించారు. ఏపీలో అభివృద్ది లేదన్నారు. ప్రదాని మోదీ అసమర్దుడని ఆయన విమర్శించారు. ఎనిమిదేళ్ళ పాలనలో మోదీ ఒక్క మంచి పని కూడ చేయలేదన్నారు. బీజీపీ నేతలకు చాలెంజ్ చేస్తున్నా... మోదీ అసమర్థత పై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మోదీ 26 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి దేశాన్ని అప్పులమయంగా మార్చారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ పోరాటం చేస్తుందన్నారు. 

Updated Date - 2022-08-02T02:09:18+05:30 IST