AP News: తరగతి గదిలో నీరసించి..

ABN , First Publish Date - 2022-09-24T21:55:17+05:30 IST

Eluru: సాంఘిక సంక్షేమ హాస్టళ్ల (Welfare Hostels)లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సరైన పోషకాహారం వడ్డించకపోవడంతో విద్యార్థులు నీరశించిపోతున్నారు. నూజివీడు మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల (Govt Junior college) తరగతి గదితో శనివారం ముగ్గురు బాలికలు కింద పడిపోయారు. కళాశాల సిబ్బంది వెంటనే వారిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న విద్యార్థినులు హాస్టల్‌లో వాస్తవ పరిస్థితిని ఏబీఎన్‌కు వివరించారు. హాస్టల్‌లో అసలు మెనూ అమలు కావడం లే

AP News: తరగతి గదిలో నీరసించి..

Eluru: సాంఘిక సంక్షేమ హాస్టళ్ల (Welfare Hostels)లో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సరైన పోషకాహారం వడ్డించకపోవడంతో విద్యార్థులు నీరశించిపోతున్నారు. నూజివీడు మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల (Govt Junior college) తరగతి గదితో శనివారం ముగ్గురు బాలికలు కింద పడిపోయారు. కళాశాల సిబ్బంది వెంటనే వారిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న విద్యార్థినులు హాస్టల్‌లో వాస్తవ పరిస్థితిని ఏబీఎన్‌కు వివరించారు. హాస్టల్‌లో అసలు మెనూ అమలు కావడం లేదని పేర్కొన్నారు. ‘‘పేరుకే మెనూ పట్టిక..కనీసం చిక్కి, గుడ్డు కూడా ఇవ్వడం లేదని, భోజనం బాగోలేక నీరసించి తరుచూ అనారోగ్యానికి గురవుతున్నామని’’ విద్యార్ధినులు ఆవేదన వ్యక్తం చేశారు.  కాగా హాస్టళ్ల‌లో ఉంటున్న ఒక్కో విద్యార్థి భోజనానికి ప్రభుత్వం రూ. 45 ఖర్చు చేస్తుంది. అయితే ఈ డబ్బుతో మేం ఏం పెట్టాలని హాస్టల్ వార్డెన్ ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల పాటు బిల్లులు చెల్లించకపోయినా.. అప్పులు చేసి పిల్లలకు పెడుతున్నామని చెప్పారు. 2018 నాటి రేట్లకు నాణ్యమైన భోజనం వడ్డించడం తమ వల్ల కాదని తేల్చిచెప్పారు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహా వార్డెన్.

Updated Date - 2022-09-24T21:55:17+05:30 IST