మిమ్మల్ని రీకాల్‌ చేయాలా? వద్దా?

ABN , First Publish Date - 2022-05-16T08:36:14+05:30 IST

మిమ్మల్ని రీకాల్‌ చేయాలా? వద్దా?

మిమ్మల్ని రీకాల్‌ చేయాలా? వద్దా?

సీపీఎస్‌ రద్దును మేనిఫెస్టోలో పెట్టారు .. ఇప్పటి వరకు అమలు చేయలేదు 

మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని  నేతను రీకాల్‌ చేయాలన్నది మీరే కదా!

అవగాహనతో మాట ఇచ్చామని అప్పుడు..  అవగాహన లేక అన్నామని ఇప్పుడంటారా?

మేం కూడా అవగాహన లేక ఓట్లు వేశాం.. విజయవాడలో సీపీఎస్‌ ఉద్యోగుల ఆగ్రహం

జూలై 24న శ్రీకాకుళంలో ధర్మపోరాటం.. సెప్టెంబరు 1న మిలియన్‌ మార్చ్‌కు పిలుపు

రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ సీఎంలకు పాలాభిషేకర


విజయవాడ, మే 15(ఆంధ్రజ్యోతి): ‘‘మాట ఇచ్చి.. మేనిఫెస్టోలో పెట్టి.. సీపీఎ్‌సను రద్దు చేయలేని ముఖ్యమంత్రిని రీకాల్‌ చేయాలా? వద్దా?’’ అని ఏపీ సీపీఎస్‌ ఉద్యోగులు నిలదీశారు. మేనిఫెస్టోను అమలు చేయని నాయకుడిని రీకాల్‌ చేయాలని అధికారంలోకి రాకముందు జగన్‌ అన్నారని, ఇప్పుడు ఎవరిని రీకాల్‌ చేయాలో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దుపై.. ఇప్పుడు అవగాహన లేక మాట ఇచ్చామని అంటున్నారని, ఆ రోజున అవగాహన ఉండే మాటిచ్చానన్నారని ఏది నమ్మాలని ప్రశ్నించారు. ‘‘సీపీఎస్‌ ఉద్యోగులను సీఎం జగన్‌ మోసం చేశారు. అధికారంలోకి వచ్చారని మీరు మడమ తిప్పినా.. సీపీఎస్‌ ఉద్యోగులు మడమతిప్పరు. ఐక్య పోరాటాలతో అట్టుడికిస్తారు’’ అని హెచ్చరించారు. ఆదివారం ఏపీసీపీఎ్‌సఈఏ ఉమ్మడి కృష్ణాజిల్లా శాఖ నేతృత్వంలో విజయవాడలోని ధర్నాచౌక్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన ‘జీపీఎ్‌స’కు వ్యతిరేకంగా ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు. ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌. అప్పలరాజు మాట్లాడుతూ, ప్రతిపక్షనేతగా అనేక సమావేశాల్లో సీపీఎ్‌సను రద్దు చేస్తానని చెప్పిన సీఎం జగన్‌ మూడేళ్లు దాటుతున్నా రద్దు చేయకపోవడం శోచనీయమన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేయకపోతే భవిష్యత్‌ తరాలు క్షమించవన్నారు. ‘‘గతంలో మీ మీద, మీ ప్రభుత్వం మీద అవగాహన లేకనే ఉద్యోగులు మీకు ఓట్లు వేశారు. ఇప్పుడు అవగాహన వచ్చింది మా ఓట్లు మాకు ఇచ్చేస్తారా అంటే ఏం చెబుతారు?’’ అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలను నేరవేర్చకపోతే ఆ నాయకుడిని రీకాల్‌ చేసే పద్ధతి ఉండాలని గతంలో జగన్‌ చెప్పిన మాటలను గుర్తు చేశారు. సీపీఎ్‌సను రద్దు చేయకపోతే ఏవరిని రీకాల్‌ చేయాలని ప్రశ్నించారు. 


జీపీఎస్‌ అంటే మోసమే!

ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పార్థసారఽథి మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ప్రతిరోజూ ఏపీసీపీఎ్‌సఈఏ బ్యానర్‌ పట్టుకుని నడిచిన జగన్‌.. ఆ రోజున ఓ నలుగురు నేతలను పిలిచి సీపీఎస్‌ మీద చర్చలు పెడుతున్నారని విమర్శించారు. సీపీఎస్‌ అంశంపై జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సంఘాలను పిలిచి చర్చిస్తే ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. సీపీఎ్‌సను రద్దు చేయకుండా జీపీఎస్‌ అంటూ ప్రభుత్వం తమను మోసం చేస్తోందని మండిపడ్డారు. ఏపీసీపీఎ్‌సయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్‌ మాట్లాడుతూ.. సీపీఎస్‌ రద్దుకు రెండు సీపీఎస్‌ సంఘాలు కలిసి ఉద్యమిస్తాయన్నారు. రెండు సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబరు 1న విజయవాడలో మిలియన్‌ మార్చ్‌ చేపట్టనున్నట్టు ప్రకటించారు. జూలై 24న శ్రీకాకుళంలో ధర్మపోరాటం పేరుతో నిరసన దీక్ష, సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. కాగా, సీపీఎ్‌సను రద్దు చేసిన రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ సీఎంలు అశోక్‌ గెహ్లోత్‌, భూపేష్‌ భగాల్‌ చిత్రపటాలకు సీపీఎస్‌ ఉద్యోగులు పాలాభిషేకం చేశారు.

Updated Date - 2022-05-16T08:36:14+05:30 IST