వారానికి 60 ఫైళ్లు పెట్టాలి

ABN , First Publish Date - 2022-05-22T09:06:05+05:30 IST

వారానికి 60 ఫైళ్లు పెట్టాలి

వారానికి 60 ఫైళ్లు పెట్టాలి

దేవదాయశాఖలో ఉద్యోగులకు టార్గెట్‌


అమరావతి, మే 21 (ఆంధ్రజ్యోతి): ఫైళ్లు పెట్టే విషయంలో దేవదాయశాఖ ఉద్యోగులకు టార్గెట్‌ విధించింది. ఇకపై సెక్షన్ల వారీగా ప్రతి ఉద్యోగి ఎన్ని ఫైళ్లు పెట్టాలి, అధికారులు ఎన్ని రోజుల్లో వాటిని పరిష్కరించాల అనే దానిపై సమయాన్ని నిర్దేశించింది. ఈ మేరకు దేవదాయ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ శనివారం ఆదేశాలు జారీచేశారు. అర్చకులకు సంబంధించిన ఫైళ్లు చూసే డబ్ల్యూ సెక్షన్‌లో ఒక్కొక్కరు నెలకు 60 ఫైళ్లు పెట్టాలని స్పష్టంచేశారు. ఆలయ ఉద్యోగుల సర్వీసు అంశాలు, ఆలయాల పరిపాలనా వ్యవహారాలు, ధార్మిక పరిషత్‌ అంశాలు చూసే ఏ, బీ, సీ, డీ, డీపీ సెక్షన్లలో వారానికి 40 ఫైళ్లు పెట్టాలని తెలిపారు. ఉద్యోగుల సర్వీసు అంశాలు, విజిలెన్స్‌, భూముల వ్యవహారాలు చూసే ఈ, వీ, ఎల్‌, ఎమ్‌ సెక్షన్లలో వారానికి 30 ఫైళ్లు పెట్టాలన్నారు. ఈ ఫైళ్లను సెక్షన్ల సూపరింటెండెంట్లు, రూటింగ్‌ అధికారులు మూడు రోజుల్లో... అదనపు కమిషనర్లు ఐదు రోజుల్లో పరిష్కరించాలని స్పష్టంచేశారు.

Updated Date - 2022-05-22T09:06:05+05:30 IST