ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళన బాట

ABN , First Publish Date - 2022-05-22T08:52:40+05:30 IST

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళన బాట

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళన బాట

జీవో 5, 7 ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఎన్‌హెచ్‌ఎం(నేషనల్‌ హెల్త్‌ మిషన్‌)లో విధులు నిర్వహించిన 22 వేల మంది ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీని అమలు చేసిన తర్వాత కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను పెంచాలని అన్ని విభాగాలను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆరోగ్యశాఖలోని డీఎంఈ, డీహెచ్‌, ఏపీవీవీపీ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వేతనాలు పెరిగాయి. కానీ, ఎన్‌హెచ్‌ఎంలో విధులు నిర్వహిస్తున్న 22వేల మంది ఉద్యోగులకు మాత్రం పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచలేదు. దీనిపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ 11 ప్రకారం తమకు జీతాలు పెంచాలని క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఆరోగ్యశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకూ అందర్నీ కలిసి వినతిపత్రాలు అందించారు. గత 10 రోజుల నుంచి ప్రతిప్రతినిధులకు, ఉన్నతా ధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నారు. ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 150 మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ప్రతినిధులు అమరావతికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - 2022-05-22T08:52:40+05:30 IST