ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలి: సీపీఎం

ABN , First Publish Date - 2022-05-22T08:35:46+05:30 IST

ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలి: సీపీఎం

ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలి: సీపీఎం

విజయవాడ(గవర్నర్‌పేట), మే 21: కారు డ్రైవర్‌ సుబ్రమణ్యం మృతికి కారణమైన ఎమ్మెల్సీ అనంతబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. దళిత యువకుడు సుబ్రమణ్యం అనుమానాస్పదంగా మృతిచెందినట్టు వచ్చిన వార్తలు తీవ్ర దిగ్ర్భాంతిని కలిగిస్తున్నాయన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం, రెండెకరాల భూమి, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని  డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-05-22T08:35:46+05:30 IST