పోలవరంలో కేంద్ర జలశక్తి అధికారుల పర్యటన

ABN , First Publish Date - 2022-05-22T08:54:00+05:30 IST

పోలవరంలో కేంద్ర జలశక్తి అధికారుల పర్యటన

పోలవరంలో కేంద్ర జలశక్తి అధికారుల పర్యటన

ప్రాజె క్టు పవర్‌ ప్యాక్‌ల పనితీరుపై ఆరా


పోలవరం, మే 21: కేంద్ర జలశక్తి సంఘం అధికారులు శనివారం పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటించారు. ప్రాజెక్టు స్పిల్వేలో 21, 22 రేడియల్‌ గేట్ల వద్ద ఏర్పాటుచేసిన పవర్‌ ప్యాక్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. రేడియల్‌ గేట్లను పైకి కిందకి కదిలించేందుకు ఏర్పాటు చేసిన సిలిండర్లను ఆపరేట్‌ చేయించి పనితీరు గమనించారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం, డయాఫ్రంవాల్‌, పవర్‌ హౌస్‌, అప్రోచ్‌ చానల్‌ తదితర పనులను కూడా పరిశీలించారు. సలహాదారు వెదిరే శ్రీరామ్‌, ప్రాజెక్టు అథారిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ల నేతృత్వంలో డ్యాం డిజైన్‌ రివ్యూ పానెల్‌, మట్టి, రాతి నాణ్యతా పరిశీలన అధికారుల బృందాలు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాయి. ఈ బృందం ఆదివారం మరికొన్ని ప్రాంతాలను పరిశీలించి ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనుంది.

Updated Date - 2022-05-22T08:54:00+05:30 IST