ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాల్సిందే

ABN , First Publish Date - 2022-05-22T08:41:29+05:30 IST

ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాల్సిందే

ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాల్సిందే

డ్రైవర్‌ సుబ్రమణ్యం మృతిపై చంద్రబాబు


అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): కాకినాడలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతిలో కేసులో నిజానిజాలు తేలేవరకూ తమ పార్టీ పోరాటం ఆపబోదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఘటనపై శనివారం ఆయన స్పందించారు. ‘సుబ్రమణ్యం ది హత్యేనని కుటుంబ సభ్యులు చెబుతుంటే పోలీసులు కేసును పక్కదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నా రు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ కాకినాడ వెళ్లినప్పు డు పోలీసులు అనుసరించిన వైఖరి దుర్మార్గంగా ఉంది. నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోం ది.  అనంత బాబును అరెస్టు చేసే వరకూ టీడీ పీ పోరాటం కొనసాగుతుంది’ అని ఆయన చెప్పారు. ఆస్పత్రి వద్ద పోలీసుల దాడిలో అస్వస్ధతకు గురైన టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజును ఆస్పత్రిలో చేర్చడంతో చంద్రబాబు ఆయనకు ఫోన్‌ చేసి పరామర్శించారు. ‘తన భర్తను కిరాతకంగా హ త్య చేసిన వారిని అరెస్టు చేయాలని సుబ్రమణ్యం భార్య పోరాటం చేస్తుంటే.. ఆమెపై పోలీసులు చేయి చేసుకోవడం ఏం దుర్మార్గం?’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  

Updated Date - 2022-05-22T08:41:29+05:30 IST