బస్సు యాత్రలో రాళ్లు పడతాయేమో చూసుకోండి: అనిత
ఒంగోలు కార్పొరేషన్, మే 21: రాష్ట్రంలో మహిళలకు ఇంట్లో ఉన్నా.., బయటకు వెళ్లినా రక్షణ లేకుండా పోయిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ చర్యలు తీసుకోవాల్సిన సీఎం జగన్ ఉలుకుపలుకు లేకుండా తిరుగుతున్నాడన్నారు. గడప గడపకు వెళ్లలేక బస్సుయాత్ర మొదలు పెడుతున్నారన్నారని, ఆ బస్సులపైకి జనం రాళ్లు విసరకుండా వాళ్లని వాళ్లే కాపాడుకోవాలని వ్యాఖ్యానించారు. మహానాడుకు భయపడే బస్సు యాత్ర చేస్తున్నారని అన్నారు. ఒంగోలులో జరుగుతున్న మహానాడు వేదిక పనులను శనివారం పార్టీ నేతలు దామచర్ల జనార్దన్, నూకసాని బాలాజి, పమిడి రమే్‌షతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు మహానాడుతో జగన్ పాలనకు చరమగీతం పాడబోతున్నామన్నారు.