ఔదార్యంతో మాజీ జవాన్లకు భూమి

ABN , First Publish Date - 2022-05-22T08:16:11+05:30 IST

ఔదార్యంతో మాజీ జవాన్లకు భూమి

ఔదార్యంతో మాజీ జవాన్లకు భూమి

సాంకేతిక కారణాలతో రద్దు చేయడానికి వీల్లేదు

ఆ భూమిని మైనింగ్‌ లీజుకివ్వడం సరికాదు: హైకోర్టు

పట్టాలు రద్దు చేస్తూ కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ రద్దు 


అమరావతి,  మే 21(ఆంధ్రజ్యోతి): దేశ సరిహద్దుల్లో సేవలందించిన సాయుధ దళాలకు పునరావాస ప్రయోజనాలు కల్పించే విషయంలో ఔదార్యంతో వ్యవహరించాలని హైకోర్టు పేర్కొంది. ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ కోటా కింద బీఎ్‌సఎ్‌ఫ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో జూనియర్‌ కమీషన్డ్‌ ఆఫీసర్లుగా పనిచేసిన ఇద్దరికి కేటాయించిన భూమిని సాంకేతిక కారణాలు చూపి  రెవెన్యూ అధికారులు రద్దు చేయడాన్ని తప్పుబట్టింది. సాంకేతిక కారణం చూపి మంజూరు చేసిన పట్టాను రద్దు చేయడం సరికాదని పేర్కొంది. యుద్ధ సమయంలో బీఎ్‌సఎఫ్‌ రక్షణదళంగా నిలుస్తుందని తెలిపింది. భూమి టైటిల్‌ పిటిషనర్ల పేరు మీద ఉండగా, మైనింగ్‌ లీజు పేరుతో మరొకరికి కేటాయించడానికి చట్టం అనుమతించదని తేల్చి చెప్పింది. పిటిషనర్లకు కేటాయించిన భూమిని రద్దు చేస్తూ కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ని కొట్టివేసింది. మైనింగ్‌ లీజు ఉత్తర్వులను రద్దు చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునంధనరావు ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు. ఎయిర్‌ఫోర్స్‌లో జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌గా పనిచేసిన బి.వెంకటరత్నంకు తూర్పుగోదావరి జిల్లా పాతతుంగపాడులో మాజీ సైనికుల కోటా కింద 3 ఎకరాలను కేటాయించి పట్టా ఇచ్చారు. ఆ పట్టాను రద్దు చేసి, ఆ భూమిని ఎం.సురేశ్‌కుమార్‌ అనే వ్యక్తికి మైనింగ్‌ లీజుకు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ వెంకటర్నం భార్య జయలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మరోవైపు బీఎ్‌సఎ్‌ఫలో పనిచేసిన దండంగి రమణకు పాతతుంగపాడులో 2.87 ఎకరాలను కేటాయించి డీఫాం పట్టా ఇచ్చారు. 2013లో ఆ పట్టాను రద్దు చేసి, ఆ భూమిని మరొకరికి మైనింగ్‌ లీజుకు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ కోటాలో భూములు పొందేందుకు పిటిషనర్లు అర్హులేనని వారి తరఫు న్యాయవాది చల్లా ధనుంజయ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు పలు తీర్పులను కోర్టు ముందుంచారు. అయితే, పిటిషనర్లు  ఎక్స్‌సర్వీ్‌సమెన్‌ కోటా పరిధిలోకి రారని, వారికి ఇచ్చిన పట్టాలు చెల్లుబాటు కావని రెవెన్యూ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు. మిలటరీ నర్సింగ్‌ సర్వీ్‌సలో పనిచేసిన మాజీ లెఫ్ట్‌నెంట్‌ ఎక్స్‌సర్వీ్‌సమెంట్‌ కోటా ప్రయోజనాలు పొందేందుకు అర్హులేనని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రస్తుత కేసుకు కూడా అదే తీర్పు వర్తిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్లకు భూముల కేటాయింపును రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2022-05-22T08:16:11+05:30 IST