అమరావతి, మే 21, (ఆంధ్రజ్యోతి): గ్రూప్-4, దేవదాయ అధికారుల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి.. వాటికి దరఖాస్తులు తీసుకుని ఐదు నెలలవుతున్నా ఇంతవరకూ పరీక్షల తేదీలను ప్రకటించలేదంటూ ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆందోళన వ్యక్తంచేసింది. పరీక్షల తేదీలను తక్షణం ప్రకటించాలంటూ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్న ఏపీ నిరుద్యోగులు అక్కడి గాంధీనగర్ పార్కులో నిరసన తెలిపింది. ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సిద్దికి, నిరుద్యోగులుపాల్గొన్నారు.