మాధవ్‌..! కులానికి నీ న్యూడ్‌ వీడియోకి ఏం సంబంధం?

ABN , First Publish Date - 2022-08-13T08:29:48+05:30 IST

మాధవ్‌..! కులానికి నీ న్యూడ్‌ వీడియోకి ఏం సంబంధం?

మాధవ్‌..! కులానికి నీ న్యూడ్‌ వీడియోకి ఏం సంబంధం?

కులాన్ని తాకట్టు పెట్టే హక్కు వైసీపీకి ఎవరిచ్చారు?

కురుబ సంఘం మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శివబాల


అనంతపురం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ‘‘మాధవ్‌... నీ న్యూడ్‌ వీడియోకి, కురబ కులానికి ఏం సంబంధం? వైసీపీకి కులాన్ని తాకట్టుపెట్టే హక్కు ఎవరిచ్చా రు?’’ అని కురుబ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శివబాల ధ్వజమెత్తారు. అనంతపురం టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యూడ్‌ వీడియోలో అడ్డంగా దొరికినా... ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలెందుకు తీసుకోలేదని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ‘‘మాధవ్‌పై చర్యలు తీసుకునేందుకు భయపడ్డారా..? ఎంపీపై చర్యలు తీసుకుంటే మిగతా వారిపై కూడా తీసుకోవాల్సి వస్తుందని వెనకడుగు వేశారా? వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎంతోమంది కురుబలపై దాడులు, దౌర్జన్యాలు జరిగాయి. మాధవ్‌... వాటి గురించి ఏనాడైనా పట్టించుకున్నావా? అనంత జిల్లా కాకపోయినా... కులస్తుడవనే సానుభూతితో కురుబలందరూ ఓట్లేసి గెలిపించింది పాడుపనులు చేయడానికా? ఏం సాధించావని.. ర్యాలీగా జిల్లాలోకి అడుగు పెట్టడానికి? వైసీపీకి దమ్ము, ధైర్యం ఉంటే.. మాధవ్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి. ఎంపీ మాధవ్‌ సమస్యకు, కురుబ కులానికి సంబంధం లేదు. కురుబలందరూ ఈ విషయాన్ని గమనించాలి’’ అని శివబాల కోరారు.

Updated Date - 2022-08-13T08:29:48+05:30 IST