అమరావతి అభివృద్ధే మేలు

ABN , First Publish Date - 2022-02-13T08:26:14+05:30 IST

అమరావతి అభివృద్ధే మేలు

అమరావతి అభివృద్ధే మేలు

విభజన సమయంలోనే రాజధానికి నిధులివ్వాల్సింది

ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ అంశాన్ని పరిశీలిస్తోంది

కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అఠవాలే 


అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మూడు రాజధానులు అని కాకుండా వైసీపీ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయడమే మేలని కేంద్ర సామాజిక, సాధికారితశాఖ మంత్రి రామ్‌దాస్‌ అఠవాలే సూచించారు. రాజధాని అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో తమ శాఖకు సంబంధించిన రాష్ట్ర అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కాలేదని గుర్తు చేశారు. మూడు రాజధానులు పెడితే ఎక్కడకు రావాలని ప్రశ్నించారు. అన్నీ ప్రాంతాలను అభివృద్ధి చేయడం మంచిదే కానీ దేనికైనా నిధులు ముఖ్యమన్నారు. విభజన సమయంలోనే రాజధానికి నిధులివ్వాల్సిందని, అవి లేకనే అభివృద్ధి జరగలేదన్నారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం దానిని విస్మరించిందన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిధులిచ్చే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసులకు సంబంధించి పరిహారం, పెన్షన్లు, పోస్టుమెట్రిక్‌, ప్రీమెట్రిక్‌ పెన్షన్ల అమలుపై రాష్ట్ర అధికారులతో సమీక్షించామన్నారు. సామాజిక, సాధికారిత శాఖ ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధులు, సబ్‌ప్లాన్‌ కేటాయింపులు తదితర అంశాలు పరిశీలించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2022-02-13T08:26:14+05:30 IST