
అన్నమయ్య: జిల్లాలోని కరభలకోట మండలం తానమిట్టలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి