
తిరుమల: ఘాట్‌రోడ్డులో ఏనుగుల గుంపు సంచారిస్తున్నట్లు గుర్తించారు. అటవీప్రాంతం నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి ఏనుగులు వచ్చాయి. దాంతో ఒకవైపు భక్తులు, మరోవైపు వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు వాపోతున్నారు. రోడ్డుపైకి వెళ్లాలంటేనే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.