కాపు సోంపురంలోకి చొరబడ్డ పులి

ABN , First Publish Date - 2022-08-14T14:04:54+05:30 IST

కాపు సోంపురంలోకి చొరబడ్డ పులి

కాపు సోంపురంలోకి చొరబడ్డ పులి

విజయనగరం: జిల్లాలోని శృంగవరపుకోట మండలం కాపు సోంపురంలోకి పులి చొరబడినట్లు స్థానికులు గుర్తించారు.  పులి సంచారంతో గ్రామస్తులు, స్థానికులు హడలెత్తుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వద్దామంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రావాల్సిందే. పొలంలోకి పోవాలంటే రైతులు వణికిపోతున్నారు. పులి తిరుగుతుందని అటవీ శాఖకు గ్రామస్తులు సమాచారమిచ్చారు. వెంటనే తగిన చర్యలు తీసుకుని అధికారులు ఆ పులిని బంధించాలని వారు కోరుకుంటున్నారు. 

Updated Date - 2022-08-14T14:04:54+05:30 IST