బాలాపూర్‌ లడ్డూ దక్కించుకున్న ఏపీ ఎమ్మెల్సీ

Sep 20 2021 @ 03:34AM

జగన్‌కు అందిస్తానని రమేష్‌యాదవ్‌ వెల్లడి

ప్రొద్దుటూరు టౌన్‌, సెప్టెంబరు 19: తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన బాలాపూర్‌ గణపతి లడ్డూను రికార్డు స్థాయి ధర రూ.18.90 లక్షలకు ఏపీ ఎమ్మెల్సీ దక్కించుకున్నారు. 25 మంది పోటీదారుల మధ్య రూ.10.16 లక్షలతో ప్రారంభమైన వేలంపాటలో నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శశాంక్‌రెడ్డి భాగస్వామ్యంలో, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమే్‌షయాదవ్‌ లడ్డూ సొంతం చేసుకున్నారు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం నిర్వహించలేదు. 2019లో పలికిన ధర కంటే ఈసారి రూ.1.30 లక్షలు అధికంగా ధర పలికింది. ఈ సందర్భంగా రమేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. లడ్డూను సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి అందజేయనున్నట్టు తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.