మద్యం ఆదాయంపైనే శ్రద్ధ

ABN , First Publish Date - 2021-10-17T08:51:02+05:30 IST

మద్యం ఆదాయంపైనే శ్రద్ధ

మద్యం ఆదాయంపైనే శ్రద్ధ

విద్యుత్‌ సమస్యలకు ప్రభుత్వానిదే బాధ్యత:రఘురామ

న్యూఢిల్లీ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్‌ అమ్మకాలపై ఉన్న శ్రద్ధ, చొరవ విద్యుత్‌ రంగంపై లేదు. ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపైనే దష్టి పెడుతోంది. విద్యుత్‌ సమస్యలపై చూపడంలేదు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ కే రఘురామకృష్ణ రాజు అన్నారు. బొగ్గు నిల్వ చేసుకోవడంలో ప్రభుత్వం ముందు చూపులేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. భవిష్యత్‌లో విద్యుత్‌ సమస్యతో రాష్ర్టాన్ని అంధకారంగా మార్చే ప్రమాదం ఉందన్నారు. నవ రత్నాలకు బదులు నవ రంధ్రాలకు తెరలేపిందని విమర్శించారు. తనపై సీఐడీ పోలీసులు భౌతిక దాడులకు పాల్పడిన ఘటనపై ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్‌ కమిటీ ఇప్పటిదాకా సమావేశం అయినట్లు సమాచారం లేదని అన్నారు. ఇదే అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై కూడ సరైన పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో శాసన మండలి రద్దుకు సిఫార్సు చేసిన సీఎంకు అండగా నిలబడి, కౌన్సిల్‌ రద్దుకు తానూ కృషి చేస్తానని రఘురామరాజు అన్నారు. 

Updated Date - 2021-10-17T08:51:02+05:30 IST