రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ

ABN , First Publish Date - 2021-10-17T09:11:04+05:30 IST

రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ

రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ

విజయవాడ, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. చివరిరోజు శుక్రవారం దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.   భక్తులు లక్షలాదిగా పోటెత్తారు. క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం దుర్గాఘాట్‌ వద్ద కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించారు. ఉత్సవమూర్తులను నదిలో మూడుసార్లు జలవిహారం చేయించాల్సి ఉన్నప్పటికీ.. వరద ఉధృతి వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఘాట్‌ వద్ద హంస వాహనాన్ని నిలిపి పూజలు నిర్వహించారు. భవానీ భక్తులతో శనివారం కూడా క్యూలైన్లు కిటకిటలాడాయి. దీంతో వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. కొండపైకి వాహనాల రాకపోకలు నిలిపివేశారు.  

Updated Date - 2021-10-17T09:11:04+05:30 IST