సాహిత్యం ద్వారా సంస్కారం: జస్టిస్‌ వెంకటరమణ

ABN , First Publish Date - 2021-10-25T09:12:21+05:30 IST

సాహిత్యం ద్వారా సంస్కారం: జస్టిస్‌ వెంకటరమణ

సాహిత్యం ద్వారా సంస్కారం: జస్టిస్‌ వెంకటరమణ

జానమద్ది స్మారక పురస్కారాల ప్రదానం


కడప (మారుతీనగర్‌), అక్టోబరు 24: బ్రౌన్‌ గ్రంథాలయ నిర్మాణంలో డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కృషి అనితర సాధ్యమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మఠం వెంకటరమణ తెలిపారు. డాక్టర్‌ జానమద్ది హనుమచ్ఛాస్త్రి 97వ జయంతిని పురస్కరించుకొని జానమద్ది సాహితి పీఠం  ఆధ్వర్యంలో ఆదివారం కడపలోని సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో జానమద్ది స్మారక సాహితీ, గ్రంథ సేవా పురస్కారాల సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్‌ వెంకటరమణ మాట్లాడుతూ సాహిత్యం ద్వారా సంస్కారం అలవడుతుందన్నారు. 2019 సంవత్సరానికి సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, 2020 సంవత్సరానికి సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్‌ వేంపల్లి గంగాధర్‌, గ్రంథసేవ విభాగంలో మనసు ఫౌండేషన్‌ అధ్యక్షులు మన్నం వెంకటరాయుడు, 2021 సంవత్సరానికి సాహిత్య విభాగంలో ప్రసిద్ధ అవధాని నరాల రామారెడ్డిలకు పురస్కారాలను అందచేశారు.

Updated Date - 2021-10-25T09:12:21+05:30 IST