చెంబుతో కొట్టి... కాలితో తన్ని.. ఆస్తి కోసం అమ్మపై కుమారుడి కర్కశత్వం

ABN , First Publish Date - 2022-02-19T09:28:09+05:30 IST

ఆస్తి కోసం కన్నతల్లి పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గపు కొడుకుపై స్థానికులే పోలీసులకు సమాచారమందించిన ఉదంతమిది...

చెంబుతో కొట్టి... కాలితో తన్ని.. ఆస్తి కోసం అమ్మపై కుమారుడి కర్కశత్వం

తాడేపల్లి టౌన్‌, ఫిబ్రవరి 18: ఆస్తి కోసం కన్నతల్లి పట్ల కర్కశంగా ప్రవర్తిస్తున్న దుర్మార్గపు కొడుకుపై స్థానికులే పోలీసులకు సమాచారమందించిన ఉదంతమిది. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం బ్రహ్మానందపురంలో కన్నతల్లి నాగమణిపై ఆమె కుమారుడు శేషు.. అమానుషంగా కాళ్లతో తంతూ, దాడి చేయడాన్ని స్థానికులు రహస్యంగా వీడియో తీసి పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. వృద్ధురాలైన నాగమణిని ఆస్తి కోసం కొంతకాలంగా కొడుకు, కోడలు కలిసి చిత్ర హింసలకు గురిచేస్తున్నారని తెలియజేశారు. శేషు చెంబు, కర్ర, కాళ్లతో తల్లిపై దాడిచేస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. స్పందించిన పోలీసులు శేషును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-02-19T09:28:09+05:30 IST