కువైత్‌లోని ప్రవాసాంధ్రులకు కరోనా కష్టాలు

ABN , First Publish Date - 2021-02-26T13:14:07+05:30 IST

కువైత్‌లోని ప్రవాసాంధ్రులకు మరోసారి కరోనా షాక్‌ తగిలింది.

కువైత్‌లోని ప్రవాసాంధ్రులకు కరోనా కష్టాలు

కేసులు పెరగడంతో కువైత్‌ నుంచి విమాన రాకపోకలు బంద్‌

రాజంపేట, ఫిబ్రవరి 25: కువైత్‌లోని ప్రవాసాంధ్రులకు మరోసారి కరోనా షాక్‌ తగిలింది. అక్కడ మళ్లీ కరోనా విజృంభించడంతో అక్కడి ప్రభుత్వం విమాన రాకపోకలను నిలిపివేసింది. వారం రోజులుగా అక్కడ కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో కువైత్‌ ఆరోగ్యశాఖాధికారుల ఆదేశాల మేరకు విదేశీయుల రాకపోకలు నిలిపివేశారు. కేవలం కువైత్‌ పౌరులు మాత్రమే ఇతర దేశాల నుంచి వస్తే అనుమతిస్తామని, వారుకూడా వచ్చిన తరువాత కువైత్‌ హోటళ్లలో వారం రోజులు, మరో ఏడు రోజులు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని ఆ దేశ ప్రభుత్వం తెలియజేసింది. దీంతో రెండు నెలల క్రితం కువైత్‌ నుంచి వచ్చి ప్రస్తుతం తిరిగి వెళ్లాలనుకునే వారు ఇబ్బంది పడుతున్నారు. కడప జిల్లా రాజంపేట ప్రాంతంలోనే ఇలాంటివారు సుమారు రెండు వేల మందికి పైగా ఉన్నారు. వీరంతా అక్కడ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 


రెండు నెలలుగా ఇంటి వద్దే ఉంటున్నా: పెరియవరం గిరిధర్‌రెడ్డి, నగిరిపాడు, చిట్వేలి మండలం

నేను కువైత్‌లో డ్రైవర్‌గా పనిచేసేవాడిని. రెండు నెలల క్రితం ఇంటికి వచ్చాను. ఇప్పుడు కువైత్‌ వెళ్లాలంటే కరోనా తీవ్రత వల్ల రాకపోకలు ఆపేశారు. 

Updated Date - 2021-02-26T13:14:07+05:30 IST