మీదా..మాదా సై!

ABN , First Publish Date - 2021-04-16T04:52:02+05:30 IST

న నేపథ్యంలో... ఇటీవల ఏపీ ఆధికారులు కూడా గ్రామాల్లో వరుసగా పర్యటిస్తున్నారు. ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్‌ గురువారం ధూళిభద్రలో గ్రామసభ నిర్వహించారు. ముగ్గురికి బియ్యం కార్డులను అందించారు. 72 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి కార్యాచరణ సిద్ధం చేశారు. 52 మొక్కలను అందించడానికి సన్నాహాలు పూర్తిచేశారు.గిరిజనులకు ఉపాధి మార్గం చూపించాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యం. సంక్షేమ పథకాలు, రాయితీలు, రేషన్‌ పంపిణీ చేయడం ద్వారా అక్కడి ప్రజలు ఏపీ వైపు మొగ్గుచూపేలా చేయా

మీదా..మాదా సై!
ధూళిభద్రలో మాట్లాడుతున్న పీవో కూర్మనాథ్‌





కొఠియాపై పట్టుకు ఏపీ, ఒడిశా ప్రభుత్వాల ఆరాటం

స్థానిక ఎన్నికల పరిణామాలతో రాజుకున్న వేడి

ధూళిభద్రలో గ్రామసభ నిర్వహించిన పార్వతీపురం ఐటీడీఏ పీవో

జానీగూడలో ఒడిశా గిరిజన నేతల సమావేశం

(సాలూరు రూరల్‌)

కొఠియా గ్రామాలపై పట్టు పెంచుకునేందుకు ఏపీ, ఒడిశా ప్రభుత్వాలు ప్రయత్నం ముమ్మరం చేశాయా? ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయా? అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో స్పీడ్‌ పెంచాయా? స్థానిక సంస్థల ఎన్నికల పరిణామాలు మరింత ఆజ్యం పోశాయా ?...అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే కొఠియా గ్రామాలపై ఒడిశా ప్రభుత్వం దృష్టిసారించిన నేపథ్యంలో... ఇటీవల ఏపీ ఆధికారులు కూడా గ్రామాల్లో వరుసగా పర్యటిస్తున్నారు. ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్‌ గురువారం ధూళిభద్రలో గ్రామసభ నిర్వహించారు. ముగ్గురికి బియ్యం కార్డులను అందించారు. 72 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి కార్యాచరణ సిద్ధం చేశారు. 52 మొక్కలను అందించడానికి సన్నాహాలు పూర్తిచేశారు.గిరిజనులకు ఉపాధి మార్గం చూపించాలన్నది ఏపీ ప్రభుత్వ లక్ష్యం.   సంక్షేమ పథకాలు, రాయితీలు, రేషన్‌ పంపిణీ చేయడం ద్వారా అక్కడి ప్రజలు ఏపీ వైపు మొగ్గుచూపేలా చేయాలన్నది వ్యూహం. ఇటీవల పరిషత్‌ ఎన్నికల సమయంలో ఒడిశా అధికారులు జులుం ప్రదర్శించారు. అప్పట్లో ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌తో పాటు పోలీస్‌, రెవెన్యూ అధికారులు చొరవచూపారు. ఒడిశా ఇబ్బందుల నడుమే ఎన్నికలు సజావుగా పూర్తిచేశారు. అప్పటి పరిణామాలను దగ్గర నుంచి చూసిన పీవో కూర్మనాథ్‌ కొఠియా గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్న నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఇటీవల ఆయన పర్యటనలతో స్పీడ్‌ పెంచారు.


ఆది నుంచి పక్కా వ్యూహంతో..

 కొఠియా గ్రూప్‌ గ్రామాలపై పట్టు సాధించేందుకు ఆది నుంచి ఒడిశా వ్యూహంతో ముందుకెళ్తోంది.  ఒక్కో గ్రామ బాధ్యతను రెండు శాఖలకు చొప్పున దత్తత ఇచ్చింది. ముడకారు, అర్జుగానివలసలను పశుసంవర్థక శాఖకు అప్పగించింది. ఆ శాఖకు చెందిన జిల్లా అధికారి గిరిజా త్రిపాఠి నిత్యం ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పరిష్కారమార్గం చూపుతున్నారు. ముడకారు గిరిజనులకు గిరి రాజా కోడి పిల్లలను అందించారు. వారి స్వయం ఉపాధికి ప్రోత్సాహం అందించారు. గిరిజనులను ఒడిశా వైపు ఆకర్షించేందుకు ప్రభుత్వం రాజకీయ సంఘటితానికి పూనుకుంది. గిరిజన నేతలతో పాటు అఖిలపక్ష నేతలను రంగంలోకి దించింది. గురువారం ఏపీ అధికారులు గ్రామసభ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఒడిశా గిరిజన నేతలు జానీగుడ వద్ద సమావేశమయ్యారు. ఒడిశా చేస్తున్న అభివృద్ధిని స్థానికులకు వివరించారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలను సైతం  రంగంలోకి దించడానికి ఒడిశా ప్రభుత్వం కార్యాచరణ చేసింది. ఇప్పటికే కొఠియా గ్రూప్‌ గ్రామాల్లో రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీ,పరిషత్‌ ఎన్నికలను ఏపీ నిర్వహించడం పట్ల గుర్రుగా ఉన్న ఒడిశా కొఠియాపై అధిపత్యం కోసం జోరు పెంచింది. ఈ నేపథ్యంలో అడ్డుకట్ట వేయడానికి ఏపీ అధికారులు ఽధీటుగా ముందుకు సాగుతున్నారు. 


మేమున్నామంటూ భరోసా

ఏ సమస్య వచ్చినా తామున్నామని..పరిష్కారమార్గం చూపిస్తామని కొఠియా (ఏపీ) సీఐ వైసీపీఎం ఎర్రంనాయుడు అన్నారు. గురువారం ధూళిభద్ర, దొరలతాడివలస, నేరేళ్లవలస, ఎగువశెంబి, దిగువశెంబి తదితర గ్రామాల్లో పర్యటించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను స్థానికులకు వివరించారు. కొఠియా గ్రామాల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆదుకుంటామన్నారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. సమస్యలపై సాలూరు పోలీస్‌స్టేషన్‌లో తనను సంప్రదించవచ్చన్నారు. 





Updated Date - 2021-04-16T04:52:02+05:30 IST