జర్నలిస్టు కుటుంబాలకు న్యాయం జరగాల్సి ఉంది: దేవిరెడ్డి శ్రీనాధ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-09-23T18:18:11+05:30 IST

ప్రెస్ అకాడమీ బాధ్యతలు స్వీకరించక అకాడమీ కార్యకలాపాలు కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యాయని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్‌ రెడ్డి తెలిపారు.

జర్నలిస్టు కుటుంబాలకు న్యాయం జరగాల్సి ఉంది: దేవిరెడ్డి శ్రీనాధ్‌రెడ్డి

విజయవాడ: ప్రెస్ అకాడమీ బాధ్యతలు స్వీకరించక అకాడమీ కార్యకలాపాలు కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యాయని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్‌ రెడ్డి తెలిపారు. జర్నలిస్ట్‌లకు శిక్షణ ఇచ్చేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. గ్రామీణ, డెస్క్ జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడం అకాడమీ బాధ్యతగా భావిస్తున్నామని... వారికి కావాల్సిన సమాచారంను అకాడమీ ద్వారా అందించడానికి ఒక వెబ్‌సైట్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులు కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్నారని అన్నారు. కోవిడ్ వల్ల మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు న్యాయం జరగాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. జర్నలిస్టుల విషయంలో ముఖ్యమంత్రి ఒక సమగ్ర ప్రణాళికతో రావాలన్నారు. ఈ నెల 26 నుండి విశాఖ జిల్లాలో జర్నలిస్టులకు ఆన్‌లైన్ తరగతులు చెప్పిస్తామని తెలిపారు. సమాచార సేకరణ ఒకే చోట లభ్యం అయ్యేలా అకాడమీ వెబ్‌సైట్ రూపొందుతుందన్నారు. 


ఏ ఏ రోజుల్లో ఏ జిల్లాల్లో  క్లాస్‌లు జరుగుతాయో వారం ముందు షెడ్యూల్  చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల వైపు నుండే తాము పనిచేస్తామని.. జర్నలిస్టులకు ఏ సమస్య ఉన్న తకు చెప్పాలని..  పరిష్కరించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వంకు సంబంధించిన వ్యక్తిగా భావించవద్దని... తమలో ఒకడిగా చూడాలని అన్నారు. ఫేక్ న్యూస్ ఈ కాలంలో చాలా వేగంగా ప్రచారం అవుతున్నాయని తెలిపారు. జర్నలిస్టులు ఈ విషయాలపై జాగ్రత్తుల తీసుకోవాలని... వాటిని సరిదిద్దగలగాలని సూచించారు. గ్రామీణ విలేకరులు శిక్షణ, కోర్స్‌లు చేసేందుకు  అయ్యే ఖర్చులో కొంత భాగం అకాడమీ భరిస్తుందని దేవిరెడ్డి శ్రీనాధ్‌రెడ్డి తెలియజేశారు.

Updated Date - 2020-09-23T18:18:11+05:30 IST