ఏపీ ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వంలో కొత్త ట్విస్ట్

ABN , First Publish Date - 2021-01-24T19:53:15+05:30 IST

ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వంగా పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గంటకు గంటకు.. నిమిష నిమిషానికి అన్నట్టుగా రెండిటి మధ్య వ్యవహారాలు సాగుతున్నాయి.

ఏపీ ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వంలో కొత్త ట్విస్ట్

అమరావతి: ఏపీలో రాష్ట్ర ఎన్నికల సంఘం వర్సెస్ ప్రభుత్వంగా పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గంటకు గంటకు.. నిమిష నిమిషానికి అన్నట్టుగా రెండిటి మధ్య వ్యవహారాలు సాగుతున్నాయి. వ్యాక్సినేషన్ నేపథ్యంలో స్థానిక ఎన్నికలను నిలుపుద చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును జగన్ సర్కార్ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆదివారం షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21, 28 తేదీలలో.. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ఇదిలా ఉంటే, స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలను కోరుతూ ఏపీ సర్కార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. దీంతో రేపు ఏం జరగబోతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

Updated Date - 2021-01-24T19:53:15+05:30 IST