AP TET ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2022-09-30T16:07:47+05:30 IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటించారు. పరీక్షల్లో 58.07 శాతం మంది అర్హత

AP TET ఫలితాలు విడుదల

అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటించారు. పరీక్షల్లో 58.07 శాతం మంది అర్హత సాధించినట్లు వెల్లడించారు. అభ్యర్థులు వారి మార్కుల వివరాలను cse.ap.gov.in/DSE/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది.


ఆగస్టులో జరిగిన పరీక్షల్లో 407329 మంది పరీక్షలు రాశారని, వారిలో 58.07శాతం మంది అర్హత సాధించారు. షెడ్యూలు ప్రకారం ఈనెల 14న ఫలితాలు విడుదల కావాలి. కానీ పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యంతో ఫలితాల్లో జాప్యం ఏర్పడింది. మరోవైపు 5.25లక్షల మంది దరఖాస్తు చేసుకోగా రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు లేకపోవడంతో ఏకంగా లక్ష మందికి పైగా పరీక్షలకు దూరమయ్యారు.

Updated Date - 2022-09-30T16:07:47+05:30 IST