మొబైల్‌లో దిశా యాప్ ఉంటే అరచేతిలో వజ్రాయుధం ఉన్నట్లే: వాసిరెడ్డి

Sep 24 2021 @ 12:55PM

కడప: మహిళా సాధికారత విషయంలో ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా మహిళలు కుటుంబంలో గౌరవం పొందుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం యాప్ ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నారని... 21 రోజుల్లో నిందితులకు  శిక్ష పడుతోందన్నారు. సమాజంలో మహిళలను సమానంగా చూడకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని కోరారు. దిశా లాంటి చట్టాలను హేళన చేస్తూ చట్టాలను ప్రతులను తగలబెడుతూ లోకేష్ ఉన్మాదులకు ఊతం ఇస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలపై ఎక్కడైనా దాడులు జరిగితే వెంటనే స్పందిస్తూ అన్నివిధాలా ఆదుకుంటున్నారని తెలిపారు. మొబైల్‌లో దిశా యాప్ ఉంటే మహిళలకు అరచేతిలో వజ్రాయుధం ఉన్నట్లే అని అన్నారు.  నెల్లూరులో జరిగిన ఘటన చాలా బాధాకరమైన విషయమన్నారు. రమ్య ఘటనలో వారం రోజుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యిందని,  ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం న్యాయం చేశామని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.