ఏపీలో ‘మా’ కార్యాలయం ఏర్పాటు చేయకుంటే హీరోలు, నిర్మాతల ఇళ్లు ముట్టడిస్తాం: యువజన విద్యార్థి సమాఖ్య

ABN , First Publish Date - 2021-10-09T23:42:28+05:30 IST

ఏపీలో ‘మా’ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ యువజన విద్యార్థి సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు.

ఏపీలో ‘మా’ కార్యాలయం ఏర్పాటు  చేయకుంటే హీరోలు, నిర్మాతల ఇళ్లు ముట్టడిస్తాం: యువజన విద్యార్థి సమాఖ్య

హైదరాబాద్: ఏపీలో ‘మా’ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ యువజన విద్యార్థి సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడూతూ ఏపీకి చెందిన సినీ నటులందరూ ‘మా’ కార్యాలయం ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏపీ విభజన జరిగి 8 ఏళ్లు అయినా ఇప్పటివరకూ ఏపీలో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయలేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఏపీ విభజన హామీలు నెరవేర్చాలంటూ కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. నవంబర్ 1న తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ కేంద్రంగా రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణకు చెందిన నేతలను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. విభజన హామీల అమలు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తామని ఏపీ యువజన విద్యార్థి సమాఖ్య నేతలు తెలిపారు. ఏపీలో ‘మా’ కార్యాలయం ఏర్పాటు చేయకుంటే సినీ హీరోల, నిర్మాతల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.



Updated Date - 2021-10-09T23:42:28+05:30 IST