‘అపర్ణా’ రూ.100 కోట్ల పెట్టుబడులు

Jun 22 2021 @ 00:03AM

అల్యూమినియం కిటికీలు, తలుపుల వ్యాపార విస్తరణ 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అల్టెజా బ్రాండ్‌తో అల్యూమినియం విండోలు, డోర్‌ సిస్టమ్స్‌ను విక్రయిస్తున్న అపర్ణా ఎంటర్‌ప్రైజెస్‌ వచ్చే నాలుగేళ్లలో ఈ వ్యాపారంలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో భాగం గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.40 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అపర్ణా ఎంటర్‌ప్రైజెస్‌ ఎండీ అశ్విన్‌ రెడ్డి తెలిపారు. మిగిలిన పెట్టుబడులను ఈ విభాగంలో ఉత్పత్తుల పోర్టుఫోలియోను పెంచుకోడానికి, మార్కెటింగ్‌, రిటైలింగ్‌ వ్యాపారాన్ని పటిష్ఠం చేసుకోవడానికి వినియోగిస్తారు. అల్యూమినియం విండోస్‌, డోర్‌సిస్టమ్స్‌ మార్కెట్‌ విలువ రూ.20,000 కోట్లు ఉంది. ఏడాదికి 7.9 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.