ప్రశాంత్‌ కిషోర్ ఓ బ్రోకర్: శైలజానాథ్

Published: Fri, 03 Dec 2021 19:39:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రశాంత్‌ కిషోర్ ఓ బ్రోకర్: శైలజానాథ్

అమరావతి: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌పై ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్‌ను ఓ బ్రోకర్‌గా అభివర్ణించారు. ప్రశాంత్‌ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్, రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి ప్రశాంత్‌కు లేదన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో ప్రశాంత్‌కిషోర్‌కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. ఏ పార్టీ డబ్బులిస్తే.. ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు చేసే బ్రోకర్లు కూడా కాంగ్రెస్‌ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.