బీజేపీ చెప్పేదొకటి చేసేదొకటి: Sailajanath

Published: Wed, 30 Mar 2022 13:52:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బీజేపీ చెప్పేదొకటి చేసేదొకటి: Sailajanath

అమరావతి: బీజేపీ చెప్పేదొకటి చేసేదొకటి అని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ముందు అసలు పెంచకుండా... ఇప్పుడు పెంచడం మోసం చేయడమే అని అన్నారు.  ప్రజలపై భారాలు వేస్తూ ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారని అన్నారు. అనంతపురం, కర్నూల్‌లో గ్యాస్ ధరలు 1000 రూపాయలు దాటిందన్నారు. ప్రజలను దోచుకోవడానికే అధికారంలోకి వచ్చారా అని నిలదీశారు. యుద్ధం వలన ధరలు పెరిగాయని చెబుతున్నారని, కానీ తటస్థంగా ఉన్నందుకు తక్కువ ధరకె డీజిల్, పెట్రోల్ ఇస్తామన్నారని తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో తటస్థంగా ఉన్నది మీరే కదా అని అన్నారు.


జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజాల కోసమే అని ప్యాలస్‌లో కూర్చుని మాట్లాడతారని మండిపడ్డారు. ఏపీలో రూ.117 పెట్రోల్ ధర ఉందని,  మిగిలిన రాష్ట్రాల్లో మనకంటే 10 రూపాయలు తక్కువ ఉందని చెప్పారు. ఆటో కార్మికుల జీవితాలను దుర్భరం చేస్తున్నారన్నారు. నిరసన తెలిపితే కేసులు, దాడులు, లేదా దేశ ద్రోహం కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ ధరలు పెంచితే ఇక్కడ జగన్ చప్పట్లు కొడుతున్నారన్నారు. చట్టాల పట్ల ఏమాత్రం అవగాహన లేని మంత్రులు 151 మంది గెలిచాం ఏమైనా చేస్తాం అని మాట్లాడుతున్నారన్నారు. కాగ్ నివేదిక ఇచ్చినా పట్టించుకోకుండా రాష్ట్రాన్ని అధోగతికి తీసుకు వెళ్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు విమర్శించారు. విశాఖ ఉక్కు అమ్ముతాం, హోదా ఇవ్వమని చెప్పినా ఏం చేయలేకపోతున్నారన్నారు. జగన్‌కు మిగిలింది ఒక్కటే..  మోదీ కాళ్ళు పట్టుకోవడమని వ్యాఖ్యానించారు. ఏ మాత్రం జంకు లేకుండా అన్ని అమ్మేస్తామని చెప్పినా మోదీని నిలదీయలేకపోతున్నారని అన్నారు. రేపు 11 గంటలకు పెరుగుతున్న ధరలకు నిరసనగా  ఆందోళన చేపడుతున్నామని, 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, 7న విశాఖలో నిరసనలు తెలుపుతామని శైలజానాథ్ వెల్లడించారు. 



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.