విద్యుత్‌చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ

ABN , First Publish Date - 2022-01-25T05:28:19+05:30 IST

విద్యుత్‌ బిల్లుల కేటగిరీల్లో మార్పులు, చేర్పులు, వాటితో పడే భారంపై వినియోగదా రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు

విద్యుత్‌చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ

ఆత్మకూరు, జనవరి 24 : విద్యుత్‌ బిల్లుల కేటగిరీల్లో మార్పులు, చేర్పులు, వాటితో పడే భారంపై వినియోగదా రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు స్థానిక డివిజన్‌ ఆఫీసులో ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈ ఆర్‌సీ) ఆధ్వర్యంలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. విద్యుత్‌ శాఖ అధికారులు, పలువురు వినియో గదారులు పాల్గొన్నారు. కేటగిరీల మార్పుల కారణంగా సామాన్యులపైనే ఎక్కువ భారం పడుతుందని వినియోగ దారులు వారి దృష్టికి తీసుకెళ్లారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం విద్యుత్‌ శాఖ డీఈ బి జనార్ధన్‌ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న విద్యు త్‌చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ ఐ శ్రీనివాసులు, రూరల్‌ ఏఈ వి వెంకటేశ్వర్లు, పట్టణ ఏఈ కేశవచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:28:19+05:30 IST