ఆ గొర్రెను చూసేందుకు ఎగబడుతున్న జనం.. కారణమేంటంటే..!

Jul 23 2021 @ 15:55PM

నైజీరియాలో ఉన్న ఆ గొర్రెను చూసేందుకు జనమంతా ఎగబడుతున్నారు.. ఎందుకంటే అది సాధారణ గొర్రె కాదు.. మామూలుగా గొర్రెలకు రెండే కొమ్ములు ఉంటాయి. అయితే నైజీరియాలోని ఈ గొర్రెకు ఐదు కొమ్ములు ఉన్నాయి.. దీంతో దీనిని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ఈ నెల 21న బక్రీద్ పర్వదినం సందర్భంగా నైజీరియాలోని లాగోస్‌ మార్కెట్‌లో గొర్రెల విక్రయం జోరుగా సాగింది. 


ఈ సందర్భంగా అక్కడకు ఓ వ్యక్తి తీసుకొచ్చిన ఈ గొర్రె అందరినీ ఆకట్టుకుంది. ఆ గొర్రెకు ఐదు కొమ్ములున్నాయి. తల మీద కిరీటం పెట్టినట్టుగా ఉండడంతో ఆ గొర్రె చాలా అందంగా కనిపిస్తోంది.  చుట్టుపక్కల ప్రజలు దాన్ని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దానిని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. గొర్రె కొమ్ములు చూస్తుంటే `స్టాట్యూ ఆఫ్ లిబర్టీ` గుర్తుకొస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇది యుగాంతానికి సంకేతమని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...