సాయి కాలర్ బోన్‌కి ప్రాక్చర్: అపోలో వైద్యులు

Published: Sat, 11 Sep 2021 00:53:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సాయి కాలర్ బోన్‌కి ప్రాక్చర్: అపోలో వైద్యులు

హైదరాబాద్‌: కేబుల్ బ్రిడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్‌ను వైద్యులు వెల్లడించారు. సాయికి కాలర్ బోన్ ప్రాక్చర్ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే సాయి ధరమ్ తేజ్ ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రాథమిక చికిత్స అందించినట్లు వారు తెలిపారు. రాబోయే 48గంటల వరకు చెప్పడానికి  ఏమీ ఉండదని వారు అన్నారు. సాయికి అత్యవసరంగా చేయవలసినది ఏమీ లేదన్నారు. రేపు ఉదయం సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడతారని డాక్టర్లు తెలిపారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామన్నారు. సాయిధరమ్‌ తేజ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆపరేషన్‌ అవసరం లేదన్నారు. 

సాయి కాలర్ బోన్‌కి ప్రాక్చర్: అపోలో వైద్యులు

 బైక్ మీద నుంచి పడడంతో శరీరంలో ఎక్కడైనా గాయాలు కావచ్చన్నారు. దాని కోసం ఐసీయూలో ఉంచి చాలా దగ్గరగా పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. సాయికి ప్రమాదం ఏమీ లేదన్నారు. సాయి తొందరగా కోలుకోవాలని మనమందరం ప్రార్థనలు చేద్దామన్నారు. ఆయన తప్పకుండా కోలుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International