APPలో చాటింగ్‌.. పబ్‌లో మీటింగ్‌.. గోవా నుంచి Hyderabad వచ్చిన మహిళ.. పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి..!

ABN , First Publish Date - 2021-12-16T16:53:02+05:30 IST

APPలో చాటింగ్‌.. పబ్‌లో మీటింగ్‌.. గోవా నుంచి Hyderabad వచ్చిన మహిళ.. పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి..!

APPలో చాటింగ్‌.. పబ్‌లో మీటింగ్‌.. గోవా నుంచి Hyderabad వచ్చిన మహిళ.. పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి..!

  • ముగ్గురు స్మగ్లర్స్‌ ఆటకట్టించిన 
  • రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ : రాచకొండ పోలీసులు ముగ్గురు డ్రగ్స్‌ సరఫరాదారులను అరెస్ట్‌ చేశారు. వారిలో ఒక మహిళ ఉండటం గమనార్హం. అల్మాస్‌గూడకు చెందిన అఖిల్‌ తరచూ గోవాకు వెళ్లి డ్రగ్స్‌ తేవడం, వాటిని స్నేహితులు జమీర్‌ సిద్దిఖీ, రమ్యతో కలిసి తీసుకోవడం అలవాటు. ఈ నెల9న జమీర్‌ సిద్దిఖీ, రమ్య కూడా గోవాకు వెళ్లి డ్రగ్స్‌ను కొనుగోలు చేశారు. తిరిగి 13న రాత్రి గోవా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ అండర్‌ బ్రిడ్జి వద్ద అఖిల్‌ను కలుసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి బ్రౌన్‌ షుగర్‌ 6.1 గ్రాములు, ఎండీఎఏ 6.1 గ్రాములు, ఎల్‌ఎ్‌సడీ బ్లాట్స్‌ 0.4 గ్రాములు, గంజాయి 1.3 గ్రాములు, కారు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ శ్యామ్‌ ప్రసాద్‌ పర్యవేక్షణలో స్మగ్లర్స్‌ ముఠా ఆటకట్టించిన ఘట్కేసర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబును, అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ జంగయ్య, ఎస్‌ఐ సుధాకర్‌, మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ సుజాత, కానిస్టేబుల్‌ సరిత, కిరణ్‌లను సీపీ మహేష్‌ భగవత్‌ అభినందించారు.

Updated Date - 2021-12-16T16:53:02+05:30 IST