వ్రతాలలో పాల్గొన్న జంటలు
సింహాచలం, నవంబరు 29: కార్తీక పూర్ణిమ సందర్భంగా వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో జరిగిన లక్ష్మీనారాయణ వ్రతాలలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పన్న దేవస్థానంలోని లక్ష్మీనారాయణస్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తుల గోత్రనామాలతో అర్చకులు పూజాది కార్యక్రమాలు జరిపారు.