భారత బాలికపై యాపిల్ సీఈఓ ప్రశంసలు.. ఈ చిచ్చరపిడుగు 8 ఏళ్ల వయసులోనే సొంతంగా ఏం చేసిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-09-26T02:58:01+05:30 IST

ఓ చిచ్చర పిడుగు ఏకంగా యాపిల్ సీఈఓనే ఇంప్రెస్ చేసింది. తానేం సాధించానో చెబుతూ ఆ బాలిక ఇచ్చిన ఈమెయిల్‌కు యాపిల్ సీఈఓ టిమ్ కుక్(Tim Cook) ఫిదా అయిపోయారు.

భారత బాలికపై యాపిల్ సీఈఓ ప్రశంసలు.. ఈ చిచ్చరపిడుగు 8 ఏళ్ల వయసులోనే సొంతంగా ఏం చేసిందో తెలిస్తే..

ఎన్నారై డెస్క్: నేటి ఆధునిక సమాజంలో పిల్లలు చాలా చిన్నవయసులోనే టెక్నాలజీకి అలవాటు పడుతున్నారు. ఎంతగా అంటే.. పది పన్నెండేళ్ల వాళ్లు కూడా కోడింగ్(Coding) చేసే స్థాయికి చేరుకుంటున్నారు. అలాంటి ఓ చిచ్చర పిడుగు ఏకంగా యాపిల్ సీఈఓనే ఇంప్రెస్ చేసింది. తానేం సాధించానో చెబుతూ ఆ బాలిక ఇచ్చిన ఈమెయిల్‌ చదివి యాపిల్ సీఈఓ టిమ్ కుక్(Tim Cook) ఫిదా అయిపోయారు. 


హానా మొహమ్మద్ రఫీక్ అనే తొమ్మిదేళ్ల బాలిక దుబాయ్‌లో(Dubai) తన తల్లిదండ్రులతో నివసిస్తోంది. ఇటీవలే ఆమె యాపిల్ సంస్థ సీఈఓకు ఓ ఈ మెయిల్ ఇచ్చింది. ఎనిమిదేళ్ల వయసున్నప్పుడే తాను ఐఓఎస్(iOS) ఆధారిత కథల యాప్‌ను(Story telling app) రూపొందించిన విషయాన్ని అందులో ప్రస్తావించింది. ‘‘ఐదేళ్ల వయసులోనే నేను కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించాను. ఈ యాప్ డిజైన్ చేసేందుకు నేను సొంతంగా 10 వేల లైన్ల కోడ్‌ను రాశాను. ప్రపంచంలో నేనే అతిపిన్న వయస్కురాలైన ఐఓఎస్ డెవలపర్ అనుకుంటా. ఇతరులు రాసిన కోడ్‌ను లేదా లైబ్రరీలు లేదా క్లాస్‌లను వాడలేదు. ఒక్కసారి మీరు దీన్ని సమీక్షించండి’’ అని టిమ్ కుక్‌కు మెయిల్ పెట్టారు. ఇక.. హానా యాప్‌ను చూసి ఇంప్రెస్ అయిన టిమ్ కుక్ వెంటనే రిప్లై ఇచ్చారు.  ఇంత చిన్న వయసులో యాప్ డిజైన్ చేసినందుకు శుభాకాంక్షలు.. భవిష్యత్తులో నువ్వు మరిన్ని విజయాలు సాధిస్తావు అంటూ రిప్లై ఇచ్చారు. 


టిమ్ కుక్ రిప్లై ఇచ్చిన విషయాన్ని హానా తండ్రే ఆమెకు చెప్పారు. దీంతో.. ఆమె సంతోషానికి అంతేలేకుండా పోయింది. ఇటీవల కాలంలో  పిల్లలకు కథలు వినిపించే  టైం తల్లిదండ్రులకు ఉండటం లేదన్న ఆలోచనే.. హానాతో ఈ యాప్ తయారు చేయించింది. ఇందులో తల్లిదండ్రులు ముందుగానే యాప్‌లో తమ కథలు రికార్డు చేయచ్చు. దీంతో.. వారు నిద్రపోతున్న సమయాల్లో కూడా పిల్లలకు కథలు వినే అవకాశం ఉంటుంది. అన్నట్టు ఈ యాప్‌ను హానా అందరికీ ఉచితంగానే ఇస్తోంది. ఓ డాక్యుమెంటరీ చూశాక తనకు ఈ ఐడియా వచ్చిందని హానా చెప్పింది.

Updated Date - 2022-09-26T02:58:01+05:30 IST