Apple CEO Tim Cook: భారత విద్యార్థులపై ప్రశంసలు.. వైరల్ అవుతున్న ట్వీట్!

Published: Sun, 27 Mar 2022 12:09:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Apple CEO Tim Cook: భారత విద్యార్థులపై ప్రశంసలు.. వైరల్ అవుతున్న ట్వీట్!

ఇంటర్నెట్ డెస్క్: భారత విద్యార్థులను మెచ్చుకుంటూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. తమిళనాడుకు చెందిన విద్యార్థులను ఆయన ట్విట్టర్ ద్వారా ప్రశంసలలో ముంచెత్తారు. వివరాల్లోకి వెళ్తే.. యాపిల్ సంస్థ గతేడాది ఐఫోన్ 13 సిరీస్‌లో భాగంగా 'ఐఫోన్ 13 మినీ' అనే మొబైల్ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌తో తమిళనాడు విద్యార్థులు అద్భుతమైన ఫొటోలు తీయడం జరిగింది. తమిళనాడుకు చెందిన 40 మంది విద్యార్థులు ఈ ఫొటోలను తీశారు. ఇప్పుడు ఆ ఫొటోలో చెన్నైలోని ప్రముఖ ఎగ్మోర్ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్నాయి. 


ఈ విషయాన్ని తెలియజేస్తూ కుక్ తాజాగా ట్వీట్‌ చేశారు. "భారతదేశంలోని తమిళనాడుకు చెందిన 40 మంది హైస్కూల్ విద్యార్థులు 'ఐఫోన్ 13 మినీ'లో తమ కమ్యూనిటీల వైబ్రేషన్‌ను క్యాప్చర్ చేశారు. ఇప్పుడు వారు చేసిన పని చెన్నైలోని చారిత్రాత్మకమైన ఎగ్మోర్ మ్యూజియంలో ప్రదర్శించబడింది” అంటూ ట్వీట్‌లో కుక్ రాసుకొచ్చారు. విద్యార్థులు తీసిన రెండు ఫొటోలను ట్వీట్‌కు జతచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేశారు. అలాగే ఇటీవల హోలీ పండుగా సందర్భంగా కూడా భారతీయులకు టిమ్ కుక్ ట్విటర్ ద్వారా విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా 'ఐఫోన్ 13 ప్రొమ్యాక్స్‌'తో తీసిన మూడు ఫొటోలను పంచుకున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.