ఆపిల్‌ సెడర్‌ వెనిగర్‌ మంచిదేనా?

ABN , First Publish Date - 2021-08-06T18:05:45+05:30 IST

ఆపిల్‌ పండ్ల రసాన్ని ఈస్ట్‌, బ్యాక్టీరియాతో పులియబెడితే అసిటిక్‌ యాసిడ్‌ తయారవుతుంది. ఈ ప్రక్రియలో తయారైనదే ఆపిల్‌ సెడర్‌ వెనిగర్‌(ఏసీవీ). వడపోయని ఏసీవీలో ‘మదర్‌’ అనే పదార్థం ఉంటుంది. దీంట్లో కొంత ప్రొటీన్స్‌, ఎంజైమ్స్‌,

ఆపిల్‌ సెడర్‌ వెనిగర్‌ మంచిదేనా?

ఆంధ్రజ్యోతి(06-08-2021)

ప్రశ్న: ఇటీవలే ఆపిల్‌ సెడర్‌ వెనిగర్‌ కొన్నాం. ఆహార పదార్థాల్లో దాన్ని వినియోగించడం వల్ల లాభాలేమిటి?


- వెంకటరావు, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: ఆపిల్‌ పండ్ల రసాన్ని ఈస్ట్‌, బ్యాక్టీరియాతో పులియబెడితే అసిటిక్‌ యాసిడ్‌ తయారవుతుంది. ఈ ప్రక్రియలో తయారైనదే ఆపిల్‌ సెడర్‌ వెనిగర్‌(ఏసీవీ). వడపోయని ఏసీవీలో ‘మదర్‌’ అనే పదార్థం ఉంటుంది. దీంట్లో కొంత ప్రొటీన్స్‌, ఎంజైమ్స్‌, ఆరోగ్యకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది రక్తంలో గ్లూకోజు శాతాన్ని, కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ని నియంత్రించేందుకు కొంత ఉపయోగపడుతుంది. ఈమధ్య కాలంలో ఊబకాయానికి, అధికబరువు తగ్గించుకోవడానికి కూడా ఈ ఆపిల్‌ సెడార్‌ వెనిగర్‌ వాడుతున్నారు. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే జీవనశైలిలో ఖచ్చితమైన మార్పులు చేసుకుని ఉదయాన్నే రెండు స్పూనుల ఏసీవీని గ్లాసు నీటిలో కలుపుకొని తాగడం వల్ల ఉపయోగం ఉంటుందని కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. హానికారక సూక్ష్మజీవులను నశింపచేసే లక్షణాలు ఉండడం వల్ల కూరగాయలను కడగడానికీ, మానని గాయాలను శుభ్రం చేయడానికీ, ఆహారపదార్థాలను నిల్వ చేసేందుకు కూడా ఆపిల్‌ సెడర్‌ వెనిగర్‌ వాడవచ్చు. మోతాదుకు మించి ఈ వెనిగర్‌ వాడటం వల్ల పళ్ళ ఎనామెల్‌ పాడవడం, వేరే మందుల ప్రభావాన్ని తగ్గించడం లాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail కు పంపవచ్చు)

Updated Date - 2021-08-06T18:05:45+05:30 IST