వాచ్‌, ఇయర్‌ఫోన్‌ అమ్మకాల్లో యాపిల్‌ టాప్‌

ABN , First Publish Date - 2021-03-20T05:53:08+05:30 IST

ఇయర్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, హెడ్‌ ఫోన్ల అమ్మకాల్లో ప్రపంచంలోనే యాపిల్‌ అగ్రస్థానంలో ఉంది. పైపెచ్చు కరోనా విపత్తు ఫలితంగా హెడ్‌ ఫోన్లకు ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చింది

వాచ్‌, ఇయర్‌ఫోన్‌  అమ్మకాల్లో యాపిల్‌ టాప్‌

ఇయర్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, హెడ్‌ ఫోన్ల అమ్మకాల్లో ప్రపంచంలోనే యాపిల్‌ అగ్రస్థానంలో ఉంది. పైపెచ్చు కరోనా విపత్తు ఫలితంగా హెడ్‌ ఫోన్లకు ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చింది. హియరబుల్స్‌(స్పష్టంగా వినేందుకు ఉపయోగపడేవి)కు గత ఏడాది డిమాండ్‌ బాగా పెరిగిందని ఐడిసి వేరబుల్స్‌ రీసెర్చ్‌ బృందం వెల్లడించింది. క్వారంటైన్‌ సమయంలో ప్రైవసీని కాపాడుకునేందుకు హియరబుల్స్‌ బాగా ఉపయోగపడ్డాయని తెలిపింది. ఒకరిని మరొకరు వ్యక్తిగతంగా కలుసుకోలేని విపత్కర పరిస్థితుల్లో అటు ఆఫీసు కార్యకలాపాలు, ఇటు మానవ సంబంధాలను సజావుగా ఉంచుకునేందుకు ఇవే బలంగా ఉపయోగపడ్డాయి. డిమాండ్‌కు అనుగుణంగా హియరబుల్స్‌ ఉత్పత్తికి సదరు సంస్థలూ పని చేశాయి. 


స్మార్ట్‌ వాచీలు, ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ మార్కెట్‌లో యాపిల్‌ రారాజుగా నిలిచిందని ఐడిసి తాజా నివేదికలో వెల్లడించింది. గత ఏడాది నాలుగో క్వార్టర్లో ఆ రెంటికి సంబంధించి యాపిల్‌ మార్కెట్‌ షేర్‌ 36.2 శాతంగా నమోదైంది. అచ్చంగా స్మార్ట్‌ వాచీలకు సంబంధించి యాపిల్‌ వాటా 45.6 శాతం. యాపిల్‌ విడుదల చేసిన సిరీస్‌ 7, వాచ్‌ ఎస్‌ఇ, సిరీస్‌ 3కి డిమాండ్‌ ఇబ్బడిముబ్బడిగా ఉంది. అయిదు శాతం పెరుగుదలతో షావోమీ రెండో స్థానంలో నిలిచింది. శాంసంగ్‌, హవాయ్‌ తరవాతి స్థానాల్లో  ఉన్నాయి. భారత్‌ బ్రాండ్‌ ‘బోట్‌’ అనూహ్యంగా అయిదో స్థానంలోకి చేరుకుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సెమీ కండక్టర్ల కొరతతో రిస్ట్‌బాండ్స్‌ వంటి వాటి షేర్‌ తగ్గింది. మార్కెట్‌లో ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌ వాచీల ఎదుగుదల స్పష్టంగా ఉందని ఐడిసి నివేదిక వెల్లడించింది.  

Updated Date - 2021-03-20T05:53:08+05:30 IST