ఆపిల్ రింగ్స్

ABN , First Publish Date - 2022-03-19T19:44:57+05:30 IST

కొంచెం వెరైటీగా, మరికొంచెం భిన్నంగా ఉంటే రెసిపీలను అప్పుడప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. అంత ఓపికా, తీరికా ఎక్కడివి..

ఆపిల్ రింగ్స్

పది నిమిషాల్లో పసందైన స్నాక్స్‌

కొంచెం వెరైటీగా, మరికొంచెం భిన్నంగా ఉంటే రెసిపీలను అప్పుడప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. అంత ఓపికా, తీరికా ఎక్కడివి.. అంటారా? తక్కువ పదార్థాలతో, ఎక్కువ పోషకాలు లభించే స్నాక్స్‌ను పది నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. అలాంటి సూపర్‌ ఫాస్ట్‌ స్నాక్స్‌ మీ కోసం!


ఆపిల్‌ ముక్కలు కోసుకుని తింటాం. జ్యూస్‌ చేసుకుని తాగుతాం. కానీ వీటితో స్నాక్స్‌ కూడా తయారు చేసుకుని తినొచ్చని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వెరైటీ తీపి వంటకాన్ని ప్రయత్నించండి. 


కావలసిన పదార్థాలు: ఆపిల్స్‌ - 3 (గట్టిగా, తీయగా ఉండే పెద్ద యాపిల్స్‌), మైదా పిండి - 1 కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - పావు టీస్పూను, ఉప్పు - పావు టీస్పూను, దాల్చిన చెక్క పొడి - అర టీస్పూను, చక్కెర పొడి - 2 టేబుల్‌ స్పూన్లు, చిక్కని మజ్జిగ - ఒక కప్పు, కోడిగుడ్డు - ఒకటి.


కోటింగ్‌ కోసం : చక్కెర పొడి, దాల్చిన చెక్క పొడి కలిపి వెడల్పాటి ప్లేట్‌లో వేసి పెట్టుకోవాలి.


తయారీ విధానం: వెడల్పాటి గిన్నెలో మైదా, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, ఒక టేబుల్‌స్పూన్‌ చక్కెర పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో కోడిగుడ్డు పగలకొట్టి వేసి, అందులో మజ్జిగ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మైదా పిండి మిశ్రమంలో వేసి పలుచగా ఉండేలా కలుపుకోవాలి. యాపిల్స్‌ తొక్క తీయకుండానే పావు అంగుళం మందంతో చక్రాల్లా తరుక్కోవాలి.యాపిల్‌ చక్రాల మధ్య చిన్న మూతను ఉంచి, గట్టిగా నొక్కి విత్తనాలతో కూడిన మధ్య భాగాన్ని తొలగించి, తీసేయాలి.ఇలా యాపిల్‌ చక్రాలను సిద్ధం చేసుకుని, పిండిలో ముంచి నూనెలో వేసి వేయించాలి. తరువాత వేయించిన ఆపిల్‌ రింగ్స్‌ను చక్కెర, దాల్చినచెక్క పొడిలో రెండు వైపులా అద్ది ప్లేట్లో అమర్చుకోవాలి. వీటిని జామ్‌, కెచప్‌, పీనట్‌ బటర్‌లతో కలిపి తింటే రుచిగా ఉంటాయి.


Updated Date - 2022-03-19T19:44:57+05:30 IST