అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-08-08T06:10:57+05:30 IST

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

విజయవాడ రూరల్‌, ఆగస్టు 7: మండలంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్టు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఇన్‌చార్జి ప్రాజెక్టు అధికారి కేబీ సుకన్య తెలిపారు. మండలంలో నాలుగు అంగన్‌వాడీ కార్యకర్తలు, మరో నా లుగు సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పీ నైనవరం-2 (బీసీ-బీ), ప్రసాదంపాడు-8(జనరల్‌), ఎనికేపాడు-5 (బీసీ-బీ), గొల్లపూడి- 17 (ఎస్సీ) కార్యకర్తల పోస్టులు, నున్న- 4(ఎస్సీ), నున్న -9 (ఎస్సీ), పీ నైనవరం-1(ఎస్సీ), ఎనికేపాడు- 4(జనరల్‌) సహాయకుల పోస్టులను భర్తీ చే స్తామని ఆమె పేర్కొన్నారు. స్థానికులు, పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులని తెలిపారు. ఈనెల 23లోగా కంకిపాడు కార్యాలయంలో దరఖాస్తులను స్వయం గా అందజేయాలని ఆమె సూచించారు. 


Updated Date - 2022-08-08T06:10:57+05:30 IST