కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-12-05T05:16:39+05:30 IST

జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద తాత్కాలిక నియామకం కింద జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు.

కాంట్రాక్టు పోస్టులకు దరఖాస్తులు

కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 4: జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద తాత్కాలిక నియామకం కింద జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిపై పని చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌-4, డీఆర్‌ టీబీ కౌన్సిలర్‌-1, టీబీ హెచ్‌వీ (ఎన్‌జీవో-పీపీ)-3 , సీనియర్‌ ట్రీట్మెంట్‌ సూపర్‌వైజర్‌-1, సీనియర్‌ ట్రీట్మెంట్‌ ల్యాబ్‌ సూపర్‌వైజర్‌-4 పోస్టులు ఉన్నాయని తెలిపారు. విద్యార్హతలు, జీతం, రోస్టర్‌ పాయింట్లు దరఖాస్తుల నమూనా వివరాలు కర్నూలు.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి 13వ తేదీలోపు దరఖాస్తులు, ఇతర పత్రాలు అందజేయాలని తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని జిల్లా క్షయనివారణ అధికారి కార్యాలయం ఓపీ నెంబరు 36లో దరఖాస్తులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలన్నారు. 

Updated Date - 2021-12-05T05:16:39+05:30 IST