ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-07-01T06:47:56+05:30 IST

జిల్లాలోని 27కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2022-2023 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి. సత్యనారాయణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

నంద్యాల (నూనెపల్లె), జూన్‌ 30 : జిల్లాలోని 27కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 2022-2023 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి. సత్యనారాయణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కొక్క కేజీబీవీలో 40సీట్ల చొప్పున 27కేజీబీవీల్లో 1080సీట్లు ఉన్నాయని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న బాలికలు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. జూలైౖ 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను మాత్రమే ఎంపికకు పరిగణలోకి తీసుకుంటా మని అన్నారు. ఆళ్ళగడ్డలో ఎంఈసీ, ఆత్మకూరులో బైపీసీ, బండిఆత్మకూరులో బైపీసీలో, డోన్‌లో ఎంపీసీ, దొర్నిపాడులో ఎంపీసీ, గడివేములలో ఎంపీసీ, గోస్పాడు బైపీసీ, జూపాడుబంగ్లా బైపీసీ, కొలిమిగుండ్ల ఎంపీసీ, మహానంది ఎంపీసీ, మిడుతూరు ఎంపీసీ, నంద్యాల బైపీసీ, అవుకు ఎంపీసీ, పగిడ్యాల ఎంపీసీ, పాములపాడు ఎంపీసీ, పాణ్యం బైపీసీ, వెలుగోడు బైపీసీ, చాగలమర్రి బైపీసీ, ఉయ్యాలవాడ ఎంపీసీ, నంద్యాల మైనార్టీ అకౌంట్స్‌ అండ్‌ టాక్సేషన్‌, రుద్రవరం ఎంపీసీ, కొత్తపల్లె ఎంపీసీ, ప్యాపిలి ఎంపీసీ, బనగానపల్లె బైపీసీ, సంజామల ఎంపీసీ, బేతంచర్ల సీఈసీ, శిరువెళ్ళ మైనార్టీలో ఎంపీసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పూర్తి వివరాలకు సమీపంలో ఉన్న కస్తూర్బా విద్యాలయాల ప్రిన్సిపాళ్లను సంప్రదించవచ్చని డీఈవో పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-01T06:47:56+05:30 IST