స్మయిల్‌ పథకానికి దరఖాస్తులు

ABN , First Publish Date - 2021-06-21T05:16:25+05:30 IST

కొవిడ్‌ కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకం అమలు చేస్తుందని ఎంపీడీవో జి.చంద్రరావు తెలిపారు.

స్మయిల్‌ పథకానికి దరఖాస్తులు


గరుగుబిల్లి: కొవిడ్‌ కారణంగా మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకం అమలు చేస్తుందని ఎంపీడీవో జి.చంద్రరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ యజమాని మృతి చెందితే కుటుంబ ఆసరాకు స్మయిల్‌ పథకంలో సుమారు రూ. 5 లక్షలు ఎన్‌బీసీఎఫ్‌డీసీ పథ కంలో మంజూరు చేస్తామన్నారు. 80 శాతం మేర రుణం, 20 శాతం రాయితీ ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎస్సీ, బీసీ కులాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. పథకానికి అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్‌, రేషన్‌కార్డు, ఫోన్‌ నెంబరుతో పాటు కుటుంబ సభ్యుల వి వరాలను కార్యాలయానికి అందించాలన్నారు.

Updated Date - 2021-06-21T05:16:25+05:30 IST