అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంవీడాలి

ABN , First Publish Date - 2021-08-02T05:30:00+05:30 IST

స్పందన అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయా సమస్యలపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్ల వద్ద ప్రజలు ఏకరువు పెట్టారు.

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంవీడాలి
స్పందనలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

- జిల్లా అధికారులను అదేశించిన కలెక్టర్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 2 : స్పందన అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వీడి సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని స్పందన హాలులో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయా సమస్యలపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్ల వద్ద ప్రజలు ఏకరువు పెట్టారు. ఆ విధంగా సోమవారం ప్రజల నుంచి 330 అర్జీలు రావడంతో కలెక్టర్‌ ప్రవీణ కుమార్‌ స్పందించారు. స్పందనలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం ప్రతిరోజు జిల్లా అధికారులు కొంత సమయం కేటాయించాలన్నారు. గడువుతీరిన అర్జీలు పెండింగ్‌లో  ఉండటంపై కలెక్టర్‌ అసంతృప్తి  వ్యక్తం చేశారు. గడువుతీరే వరకు ఆర్జీలు పరిష్కరించకపోతే ఆశాఖ అధికారులు ఉనికిలో లేనట్లుగా ప్రభుత్వం  భావిస్తుందన్నారు. అందువల్ల అధికారులు ఆయా అర్జీలపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. అనంతరం ఆయా శాఖల వారీగాపెండింగ్‌లో ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు జే వెంకటమురళీ, టీఎస్‌ చేతన్‌, కేఎస్‌ విశ్వనాఽథన్‌, కే కృష్ణవేణి, డీఆర్వో తిప్పేనాయక్‌, సీపీవో వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

- గుండ్లకమ్మ జలాశయం ముంపు బాధితుల కోసం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద నిర్మించిన పునరావాస కాలనీలో శ్మశాన వాటికకు  భూమి కేటాయించాలని  అద్దంకి మండలం వేణుగోపాలపురం సర్పంచ్‌ పూనాటి విక్రమ్‌ కోరారు. 

- మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని దోర్నాల మండలం బొమ్మలాపురం గ్రామ చెంచుగూడెంకు చెందిన డి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.  

- వ్యవసాయ భూమికి దారి ఏర్పాటు చే యించాలని తర్లుబాడుకు చెందిన షేక్‌ ఖరీం సాహెబ్‌, జీ చిన్న పిచ్చయ్య తదితరులు కోరారు.  

- తన భూమిని అక్రమంగా ఆన్‌లైన్‌ చేసుకున్నారని చినగంజాం మండలం పెదగంజాంకు చెందిన ఎం. మురళీమోహన్‌రావు ఫిర్యాదు చేశారు.  ఇలా పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆయా సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. 

Updated Date - 2021-08-02T05:30:00+05:30 IST