‘అమరరాజా’లో నైపుణ్య శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

ABN , First Publish Date - 2021-10-27T07:13:30+05:30 IST

‘అమరరాజా’లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ అధికారి పేర్కొన్నారు.

‘అమరరాజా’లో నైపుణ్య శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

పూతలపట్టు, అక్టోబరు 26: ‘నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఉచితంగా ఇస్తాం. అలాగే ఉద్యోగావకాశాలు కల్పిస్తాం’ అని అమరరాజా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ అధికారి రవికుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పూతలపట్టు మండలం పేటమిట్ట సమీపాన 2014లో ఈ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 1561 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగిందన్నారు. టెన్త్‌ పాస్‌/ఫెయిల్‌, ఇంటర్‌ ఫాస్‌/ఫెయిల్‌ అయినవారు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ కాలంలో నెలకు రూ.7500-10846 వరకు ఇస్తామని తెలియజేశారు. 

Updated Date - 2021-10-27T07:13:30+05:30 IST