ప్రధాన ఆర్థిక జ్యోతిష్కుడిని నియమించుకోండి... Nirmala Sitharamanను ఎద్దేవా చేసిన Chidambaram ...

ABN , First Publish Date - 2022-07-14T21:35:24+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ

ప్రధాన ఆర్థిక జ్యోతిష్కుడిని నియమించుకోండి... Nirmala Sitharamanను ఎద్దేవా చేసిన Chidambaram ...

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఎద్దేవా చేశారు. ఆమె తన స్వంత నైపుణ్యాలపై ఆశలు వదులుకున్నారని, అందుకే గ్రహాలను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి గ్రహాలను పిలుస్తున్నారని చురకలంటించారు. 


అమెరికా రోదసీ పరిశోధక సంస్థ నాసా (NASA) ట్వీట్ చేసిన యురేనస్, ప్లూటో, జూపిటర్ చిత్రాలను నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం రీట్వీట్ చేశారు. ఈ చిత్రాలను నాసా నూతన శక్తిమంతమైన స్పేస్ టెలిస్కోప్‌తో తీశారు. 


ఈ నేపథ్యంలో చిదంబరం (P Chidambaram) గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, ద్రవ్యోల్బణం (Inflation) 7.01 శాతం, నిరుద్యోగం (Unemployment)  పెరుగుదల 7.8 శాతం నమోదైన రోజున ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జూపిటర్, ప్లూటో, యురేనస్ (Jupiter, Pluto and Uranus) చిత్రాలను ట్వీట్ చేయడం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఆమెకు తన సొంత నైపుణ్యాలపైనా, తన ఆర్థిక సలహాదారుల నైపుణ్యాలపైనా ఆశలు అడుగంటాయని, అందుకే ఆర్థిక వ్యవస్థను కాపాడాలని గ్రహాలను పిలుస్తున్నారని అన్నారు. 


"CEA: Chief Economic Astrologer" (ప్రధాన ఆర్థిక జ్యోతిష్కుడు)ను నియమించుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. 


నిర్మల సీతారామన్ ఈ గ్రహాల చిత్రాలను రీట్వీట్ చేయడంపై కాంగ్రెస్ బుధవారం ఘాటుగా స్పందించింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కన్నా యురేనస్, ప్లూటోలపైనే ఆమె ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని మండిపడింది. 


Updated Date - 2022-07-14T21:35:24+05:30 IST