నియామకపత్రాలను అందిస్తున్న జడ్పీ సీఈవో, డీపీవోలు
జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి
చిత్తూరు కలెక్టరేట్, నవంబరు 28: గ్రామ సచివాలయాల ఉద్యోగులు విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉందని జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి అన్నారు. స్థానిక జడ్పీ మీటింగ్‌హాలులో శనివారం పంచాయతీ సెక్రటరీలుగా(గ్రేడ్-5) ఎంపికైన 9 మందికి, డిజిటల్ అసిస్టెంట్లుగా(గ్రేడ్-6) ఎంపికైన 277 మంది అభ్యర్థులకు ఆయన నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీపీవో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలందించాలని సూచించారు. స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో 264 మంది సచివాలయ అభ్యర్థులకు కమిషనర్ విశ్వనాథ్ నియామకపత్రాలను ఇచ్చారు. సమావేశంలో జిల్లా వనరుల కేంద్రం కో-ఆర్డినేటర్ ఐఆర్ షణ్ముగరామ్ పాల్గొన్నారు.